Keerthy Suresh: చక్కనమ్మా చిక్కినిట్టుందే..చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తున్న కీర్తి సురేశ్

-

అందాల ముద్దుగుమ్మ, నేషనల్ అవార్డు విన్నర్ ‘మహానటి’ కీర్తి సురేశ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి ‘నేను శైలజ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ భామ స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా దాదాపుగా యాక్ట్ చేసింది. ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ సుందరి.

 

సోషల్ మీడియా వేదికగా తన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది ఈ అమ్మడు. తాజాగా సిల్క్ శారీలో స్లీవ్ లెస్ జాకెట్ ధరించి ఉన్న తన గార్జియస్ ఫొటోలు షేర్ చేసింది. అవి చూసి నెటిజన్లు ‘వావ్, సో ప్రెట్టీ, బ్యూటిఫుల్, అదిరింది’ అని కామెంట్స్ చేస్తున్నారు. కొప్పున మల్లె పూలు పెట్టుకుని అలా ఓర చూపులతో సంప్రదాయానికి ప్రతీక అయిన చీర కట్టులో కీర్తి సురేశ్ మెరిసిపోతున్నది. ఈ ఫొటోలను చూసిన హీరోయిన్ రాశి ఖన్నా సో ప్రెట్టీ అని కామెంట్ చేసింది.

 

అలా కుర్చీలో కూర్చొని, నిలబడి, శారీలో తన బ్యాక్ అందాలు చూపుతూ కాక రేపుతున్నది కీర్తి సురేశ్. ఈ సుందరి నటించిన గత చిత్రాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. అయినప్పటికీ ఈ భామ సినిమాలపై వాటి ప్రభావం పడకపోవడం విశేషం. ‘చక్కనమ్మా చిక్కినా అందమే’ అన్న చందంగా ఈ భామ సన్నబడిపోయింది. గతంలో కొంచెం బొద్దుగా ఉన్న ఈ సుందరి వెయిట్ లాస్ అయిన విషయం ఫొటోల ద్వారా స్పష్టమవుతోంది.

 

ప్రస్తుతం ఈ భామ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో నటిస్తోంది. చిరుకు చెల్లెలిగా నటిస్తోంది. ఈ భామ నటించిన మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ వచ్చే నెల 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి ‘కళావతి, పెన్నీ’ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటిని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version