సైబర్‌ వలలో కేజ్రీవాల్‌ కుమార్తె..!

-

సైబర్‌ నేరగాళ్లు విసురుతున్న వలలకు అమాయకులే కాక, విద్యావంతులు, ప్రముఖులు సైతం చిక్కుతున్నారు. వీరి కట్టడికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదో ఓ చోట సైబర్‌ నేరగాళ్ల చిక్కుల్లో పడుతూనే ఉన్నారు. ఇటీవల, ఏకంగా దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ కుమార్తె హర్షిత బ్యాంక్‌ అకౌండ్‌ నుంచి సెబర్‌ కేటుగాళ్లు రూ. 34 వేలు తస్కరించినట్లు పోలీసులు తెలిపారు. అందుకు సంబంధించి విరాలు..


రెండు విడతలుగా..

హర్షిత ఓ ఈ– కామర్స్‌లో సోఫా అమ్మకానికి పెట్టింది. అది చూసిన ఓ వ్యక్తి సోఫాను కొనేందుకు సిద్ధమైనట్లు రిప్లే ఇచ్చాడు. ఇద్దరి మధ్య ఓ ధర కుదిరిన తర్వాత డబ్బులు పంపే క్రమంలో బ్యాంక్‌ వివరాలు సరిగా ఉన్నాయో లేదో నని ఓ సారి చెక్‌ చేసుకోవాలని ఆమె అకౌంట్‌కు కొంత డబ్బు పంపించాడు. ఆ తర్వాత హర్షిత ఫోన్‌కు ఓ క్యూర్‌ కోడ్‌ పంపించి, దాన్ని స్కాన్‌ చేస్తే ఇవ్వాల్సిన డబ్బులు మీకు చేరుతాయని చెప్పడంతో, ఆమె ఆ క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయగానే హర్షిత అకౌంట్‌ నుంచి రూ. 20 వేలు కట్‌ అయినట్లు మెసెజ్‌ వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు.

ఈ విషయమై ఆమె అతగాడిపై కోప్పడటంతో ‘స్వారీ పొరపాటున తప్పుడు క్యూఆర్‌ కోడ్‌ పంపించానని.. మరో కొత్త క్యూఆర్‌ కోడ్‌ పంపిస్తానంటూ మరొకటి పంపించి ముందులాగే స్కాన్‌ చేయాలన్నాడు. దీంతో ఆమె మరోసారి వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయగానే వెంటనే ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి మరో రూ. 14 వేలు కొల్లగొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడిపై కేసు నమోదు చేశామని, అతడి క్యూఆర్‌ కోడ్, తదితర వివరాలు సేకరించి త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version