స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఐదు కోట్ల మంది ప్రజలు తరపున లేఖ రాశారని అన్నారు. ఏపీకి కేంద్రం అన్నిరకాలుగా అన్యాయం చేస్తోందన్న ఆయన విభజన హామీ చట్టం హామీలు అమలు చేయడం లేదని అన్నారు. ఎం.పి విజయసాయి రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ ను, ఉక్కు మంత్రిని కలిశారని, అలానే కార్మిక సంఘ నాయకుల్ని ఢిల్లీ కి తీసుకువెళ్తామని అన్నారు. ప్రజలు యొక్క సెంటిమెంట్ ను కేంద్రం గౌరవించకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారన్నా మంత్రి వాజపేయి, మన్మోహన్ సింగ్ ప్రధానులు ఉన్న సమయంలో ప్రైవేటు చేయాలి అనుకుంటే అప్పట్లో వ్యతిరేకించామని అన్నారు.
దక్షిణాది రాష్ట్ర ప్రజలు గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు అని అనన్ఱు. కొందరు అమరావతి ఉద్యమంతో ముడిపెడుతున్నారని అలా చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం పరంగా మా వైపున పోరాటం చేస్తున్నామన్న ఆయన కేంద్రం పై ఒత్తిడి తీసుకు వస్తున్నాం, అందరూ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని అన్నారు. అలానే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనేది అవాస్తవమని, ప్రవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, రాష్ట్రంలో ఏ ఒక్కరు అంగీకరించరని అన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు లేఖ స్పష్టంగా రాయండి, ప్రతి విషయం రాజకీయం చేయడం మానుకోండని ఆయన కోరారు. రేపు ఉదయం 8 గంటలకు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేటు వద్ద నిరసన చేపడతామని ఆయన అన్నారు.