కేజ్రీవాల్ VS బీజేపీ.. ఇద్దరి మధ్య రిమోట్ కంట్రోల్ టాయిలెట్ పంచాయితీ!

-

ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న టైంలో లగ్జరీ జీవితాన్ని లీడ్ చేశారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. ప్రజల ధనంతో ‘రిమోట్ కంట్రోల్‌’తో పనిచేసే స్మార్ట్ టాయిలెట్లను కేజ్రీవాల్ తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేయించుకున్నారని ఫైర్ అయ్యారు. ఆ స్మార్ట్ టాయిలెట్లలో వాటర్ ప్రెషర్, టెంపరేచర్ స్థాయి, సీటులో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు వంటివి అన్నింటినీ రిమోట్ కంట్రోల్‌తో సెట్ చేయొచ్చని సంబిత్ పాత్ర ఆరోపించారు.

‘ఢిల్లీ సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన టైంలో ‘టోటో’ కంపెనీకి చెందిన స్మార్ట్ కమోడ్‌ను కేజ్రీవాల్ తన వెంట తీసుకెళ్లిపోయారు’ అని అన్నారు. వెంటనే దానిని వెనక్కి తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు.‘కేజ్రీవాల్.. ప్రజెంట్ స్మార్ట్ టాయిలెట్ మీ చేతుల్లోనే ఉంది.కానీ, రిమోట్ కంట్రోల్ ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయింది. కేజ్రీవాల్‌ను ప్రజలు పెనంపై కూర్చోబెట్టడం ఖాయం’ అని సంబిత్ పాత్ర విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version