నకిలీ గుడ్లను తింటే అంతే సంగతులు.. ఇలా గుడ్డు నకిలీదో కాదో తెలుసుకోండి..!

-

మార్కెట్లో చాలా నకిలీ ఆహార పదార్థాలు దొరుకుతున్నాయి. రకరకాలుగా వినియోగదారులని మోసం చేస్తున్నారు. ఆహార పదార్థాల విషయంలో కల్తీ జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ ఆహార పదార్థాలు మార్కెట్లో కనపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు ప్లాస్టిక్ వెల్లుల్లిపాయలు దుమారం రేపాయి. ఇప్పుడు గుడ్లని తీసుకువచ్చారు. మార్కెట్లో దొరికే గుడ్లు నకిలీవా కాదా అనేది తెలుసుకోవాలి ఆరోగ్యానికి మేలు చేసే గుడ్లని చాలా మంది రెగ్యులర్ గా తింటూ ఉంటారు. గుడ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అనవసరంగా మోసపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది.

ప్లాస్టిక్ గుడ్లని తీసుకోవడం వలన సున్నా పోషక విలువలు ఉండడమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది గుడ్డు నిజమైనదా లేదంటే నకిలీదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది విషయాన్నీ ఇప్పుడు చూద్దాం. ముందు చెక్ చేయండి మనం ప్లాస్టిక్ గుడ్లని గమనించినట్లయితే వాటి యొక్క పై భాగం అంతా స్మూత్ గా ఉంటుంది. పైగా ఎలాంటి పగుళ్లు వంటివి కనిపించవు. పెయింట్ వేసినట్టు ఉంటుంది. నిజమైన గుడ్డును చూసినట్లయితే రంగు వేసినట్లు అనిపించడం వంటివి కనిపించవు.

ప్లాస్టిక్ గుడ్డు లో మనకి మార్పు కనబడుతుంది. గుడ్డు బరువుని సైజుని కూడా గమనించండి. ప్లాస్టిక్ గుడ్లు తేలిగ్గా ఉంటాయి ఒకసారి వాటిని ముట్టుకుని చూస్తే మీకు అర్థమవుతుంది. వాటర్ టెస్ట్ చేయండి. నిజమైన గుడ్లు మునిగిపోతాయి ప్లాస్టిక్ గుడ్లు తేలడమే కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. నిజమైన గుడ్లని ఒకసారి ఊపి చూసినట్లయితే ఒక రకమైన సౌండ్ వస్తుంది. అదే ప్లాస్టిక్ గుడ్లలో అలా రాదు. హానికరమైన పదార్థాలు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్లాస్టిక్ గుడ్లను తీసుకుంటే జీర్ణ సమస్యలు, బ్లోటింగ్, గ్యాస్, డయేరియా ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version