హత్యా రాజకీయాలతో కేరళ అట్టుడుకుతోంది. వరసగా వేరేవేరే పార్టీకు చెందిన ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. 12 గంటల వ్యవధిలో ఈ రెండు హత్యలు చోటు చేసుకోవడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కేరళలోని అలప్పుజా జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. దీంతో అలప్పుజ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. సోషల్ డెమోక్రాటిక్ ఛీప్ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) నేత కేఎస్ షాన్ ను కొందరు దుండగులు శనివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. పార్టీ ఆఫీసు నుంచి బండిపై ఇంటికి వెళ్తున్న షాన్ ను కారుతో ఢీకొట్టి, కొట్టి చంపారు.
హత్యా రాజకీయాలతో అట్టుడుకుతున్న కేరళ… వరసగా ఇద్దరు రాజకీయ నాయకుల హత్య.
-