కోవిడ్ సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. దేశమంతటా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఐతే కరోనా సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ఈ కారణంగా ఆర్థికంగా రాష్ట్రాలకు పెద్ద దెబ్బ పడింది. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. దీనికోసం తాజాగా కేరళ ప్రభుత్వం కోవిడ్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది. 20వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది.
ఇందులో వ్యాక్సినేషన్ తో పాటు పేదరిక నిర్మూలన మొదలగు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కరోనా కారణంగా చితికిపోయిన ప్రజలకు రక్షణ కల్పించడానికి కోవిడ్ బడ్జెట్ తీసుకువచ్చారు. ఈ ప్యాకేజీలో వెయ్యికోట్లు వ్యాక్సిన్లపై, 2800కోట్లు ఆరోగ్యంపై, 8300కోట్లు ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు కేటాయించారు. కోవిడ్ పరిస్థితుల్లో కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశమంతటా ఆదర్శప్రాయంగా ఉంటున్నాయని నేటిజన్లు ప్రశంసిస్తున్నారు.