ప్రస్తుతం కరోనా వైరస్(కోవిడ్-19) ప్రపంచదేశాల ప్రజలను పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి దెబ్బకు అగ్ర దేశాలు అతలాకుతలం అవుతున్నాయి.. చిన్న దేశాలు చిగురుటాకులా వణికిపోతోంది. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా ధాటికి దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ఈ కనిపించని శత్రువుపై చేస్తున్న పోరాటంలో నిత్య మృత్యు ఘోష తప్పడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 17,80,271 మందికి కరోనా సోకగా.. 1,08,822 మంది మృత్యువాత పడ్డారు.
మరోవైపు కరోనాను కట్టడి చేయడానికి పలు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో కోట్ల మంది ఇళ్లకే పరిమితయ్యారు. ఇక వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు. అందుకే కరోనా వైరస్ మట్టుపెట్టేందుకు ప్రతీ ఒక్కరూ సోషల్ డిస్టాన్స్ పాటించాలని.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే అది ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు పదే పదే చెబుతూనే ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పెడచెవిన పెడుతూ నిర్లక్ష రహితంగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ బిచ్చగాడు చెప్పిన పాఠాలు కొందరికి ఆదర్శంగా నిలుస్తాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ లో ఆకలితో అలమటిస్తున్న యాచకులకు పోలీసులు ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కోజికోడ్‌లో ఆహారం పంపిణీ చేస్తుంటే ఓ వీధిలో ఓ బిచ్చగాడు కనిపించాడు. ఆ బిచ్చగాణ్ని చూసిన పోలీసులు అతని ఆకలి తీర్చడానికి ఆహారాన్ని తీసుకొచ్చారు. వారిని చూసిన బిచ్చగాడు దూరం దూరం.. అంటూ కేకలు వేశారు. అసల పోలీసులకు అతడు ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు.
ఇంతలోనే సదరు బిచ్చగాడు చొక్కాతో ముక్కు మూసుకుని.. ఇక్కడ ఆహారం పెట్టాలంటూ స్థలం చూపించాడు. పోలీసులు సైతం అతడు చెప్పిన చోట ఫుడ్ పెట్టి వెనక్కి వెళ్లగానే.. బిచ్చగాడు వచ్చి ఆహారం తీసుకున్నాడు. అప్పుడు అర్థం అయింది పోలీసులకు.. అతను సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తున్నాడని. ఆ బిచ్చగాడికి ఉన్న సామాజిక బాధ్యతకు పోలీసులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో నిర్లక్ష రహితంగా వ్యవహరించేవారు ఏం నేర్చుకోవాలి అన్నది స్పష్టంగా అర్థం అవుతుంది.
Lesson to be learnt from this Kozhikode homeless man. No wonder Kerala and its people prosper and are successful in controlling the present covid crisis. pic.twitter.com/0bC69x2NgG
— Baby Menon (@BabyMenonS) April 11, 2020