కేరళలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. 24 గంటల్లో 300 మందికి పాజిటివ్‌, ముగ్గురు మృతి

-

ఇండియాలో కరోనా పరంపర కొనసాగుతూనే ఉంది. కేరళలో అయితే కరోనా డెంజర్‌ బెల్స్ మోగిస్తుంది. ఇన్ని రోజులు కామ్‌గా ఉన్న ఈ వైరస్‌ ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. ఇప్పటికే కేరళలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 300 దాటింది.. 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు. ఇవి కేవలం అధికారిక లెక్కలే. హైదరాబాద్‌లో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. డిసెంబర్‌ 21 వరకూ భారతదేశంలో 358 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 300 కేసులు కేరళలో నమోదయ్యాయి. ఇప్పుడు దేశంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 2,341కి పెరిగింది. గత 24 గంటల్లో, దేశంలో 211 మంది కరోనా నుండి కోలుకున్నారు.

కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు తెలిపారు. కేరళ అన్ని విధాలా సిద్ధంగా ఉంది. ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు పెంచారు. తదుపరి పరీక్ష జరుగుతోంది. కోవిడ్ యొక్క తేలికపాటి లక్షణాల కారణంగా వారిలో ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ గురించి భయపడవద్దని విజ్ఞప్తి చేశారు. వర్చువల్ మోడ్ ద్వారా బుధవారం జరిగిన సమావేశంలో మాండవ్య మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అవసరమైన సహకారం అందిస్తుంది. కోవిడ్ యొక్క కొత్త వేరియంట్ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించేందుకు అవసరమైన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 51,214 కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2.16 కోట్ల క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇందులో బ్రెజిల్ 11.73 లక్షలు, అమెరికా 9.89 లక్షలు, వియత్నాం 9.39 లక్షలు. ప్రపంచంలోని మొత్తం కేసుల్లో భారతదేశంలో కేవలం 0.009% మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version