జేసీపై కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి 74 ఏళ్లు.. మరో మూడేళ్లలో చచ్చిపోతాడని, అలాంటివాడితో యుద్ధం చేయడం అనవసరమంటూ వ్యాఖ్యలు చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. చేసిన దౌర్జన్యాల ఫలితమే ఇవాళ అనుభవిస్తున్నారని కామెంట్స్ చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.

ఇక అటు నిన్న 6 గంటల పాటు రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చునాన్రు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. దింతో అనంతపురం జిల్లా నారాయణరెడ్డిపల్లిలో హైడ్రామా నెలకొంది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్న కేతిరెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులు అడ్డుకోవడంతో నారాయణరెడ్డిపల్లిలో రోడ్డుపైనే కుర్చీ వేసుకొని 6 గంటల పాటు కూర్చున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. నడిరోడ్డుపైనే భోజనం చేశారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.