కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.కొందరు అమాయకులను ఆసరగా చేసుకుని వారిని నిలువుగా దోచేస్తున్నారు. తాజాగా ఏపీలోని అనంతపురం జిల్లా ఉరవకొండ కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో ఏటీఎం కార్డు మార్చి ఓ కేటుగాడు మరో వ్యక్తిని బురిడీ కొట్టించాడు. అనంతరం మార్చిన ఏటీఎం కార్డు ద్వారా రూ.75 వేలు నగదు విత్ డ్రా చేశాడు. కళ్ళ ముందే కనికట్టు చేసినట్లు ఏటీఎం కార్డు మార్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
డబ్బులు పొగొట్టుకున్న బాధితుడు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించి అసల విషయం వెల్లడించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాంకు ఏటీఎంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు,ఏటీఎం మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సామాన్య ప్రజలను హెచ్చరించారు.