ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికే జీహెచ్ ఎంసీలో వార్డు కమిటీలను వేస్తున్నామని చెప్పారు మంత్రి కేటీఆర్. యూత్, మహిళ, సీనియర్ సిటిజన్ కమిటీ, ఎమినెంట్ సిటిజెన్ కమిటీలను వేస్తామని, ఈ కమిటీలు ప్రతీ మూడు నెలలకోసారి భేటీ అవుతాయని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా వార్డు కమిటీల ఏర్పాటు ఉంటుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు. కమిటీల్లో అన్ని వర్గాల వారికి అవకాశం వస్తుందని చెప్పారు. కమిటీల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
జీహెచ్‌ఎంసీ చట్టంలో బీసీల రిజర్వేషన్ యథాతథంగా ఉందని, ఇందులో ఎలాంటి మార్పూ చేయలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి కేటీఆర్. ఆర్టికల్ 243 -టీ ప్రకారం 33.333 శాతం బీసీ రిజర్వేషన్లను డిస్టబ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్‌లో భూ సమస్యలు లేకుండా విపక్షాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు . స్థిరాస్థి పై పౌరులకు సర్వహక్కులు ఉండేలా నాన్ అగ్రికల్చర్ భూములను ధరణిలో పొందుపరుస్తున్నామన్నారు కేటీఆర్.