ఏపీ టీడీపీలో కీలక మార్పులు, పార్టీ అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడు…?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగు దేశం పార్టీని బ్రతికించుకోవడానికి గానూ ఎక్కువగా కష్టపడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఆ పార్టీ చాలా వరకు బలహీనంగా ఉంది. ఆ పార్టీకి బలం అనేది ఇప్పుడు చాలా అవసరం. సమర్ధవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోకపోతే పార్టీ మనుగడ అనేది చాలా కష్టం.

దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎన్నో చర్చలు. రాజకీయంగా చంద్రబాబు ప్రస్తానం అనేది దాదాపుగా ముగిసింది అనేది అర్ధమవుతుంది. ఈ తరుణంలో నాయకత్వాన్ని మార్చి పార్టీని ముందుకి నడిపించాలి అనేది ఆయన భావన. ఇందుకోసం నాయకత్వ మార్పుని చేయడానికి సిద్దమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడు ని నియమించాలని ఆయన భావిస్తున్నారు.

గల్లా జయదేవ్ ని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించి తాను… గౌరవ అధ్యక్షుడిగా ఉండాలని ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్ధిని కూడా మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఈసారి రామ్మోహన్ నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్ధి అని వచ్చే ఎన్నికల నాటికి ఈ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉత్తరాంధ్ర తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి క్రేజ్ ఉంది అనేది వాస్తవం.

ఇక అన్ని పార్టీలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. వివాద రహితుడిగా కూడా ఆయనకు పేరు ఉంది. అందుకే చంద్రబాబు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు విషయంలో కీలక అడుగు వేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు కుటుంబం ముందు నుంచి కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తుంది. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఎర్రన్నాయుడు కీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version