మర్కాజ్ విషయంలో భయపడకుండా వాస్తవాలు చెప్పిన కేసీఆర్…!

-

తెలంగాణాలో కరోన వైరస్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే. ఎవరు ఎన్ని అన్నా సరే మర్కాజ్ యాత్రికుల తర్వాత కరోనా కేసుల సంఖ్య బాగా పెరిగింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దేశ వ్యాప్తంగా కరోన కేసులు పెరగడానికి వాళ్ళే కారణమని అంటున్నారు అందరూ కూడా. అయితే చాలా రాష్ట్రాలు ఈ విషయంలో ముందుకి వచ్చి వాస్తవాలు బయటపడుతున్న తరుణంలో తెలంగాణా మాత్రం భయపడటం లేదు.

తెలంగాణా సిఎం కేసీఆర్ ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వాళ్ళ విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు చెయ్యాలి అని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు వాళ్ళను వెనకేసుకుని వస్తూ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కాని కేసీఆర్ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గలేదు. వాళ్ళతోనే కరోనా వచ్చింది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.

తెలంగాణాలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. అయితే ఆయన ఇక్కడ ముస్లిం లకు ఏ ఇబ్బంది రాకుండా నిర్ణయాలు తీసుకుని ఎన్పీఆర్ ని అమలు చేసేది లేదని స్పష్టంగా చెప్పారు. రాజకీయంగా తెరాస పార్టీకి వాళ్ళు అందగానే ఉన్నా సరే కేసీఆర్ మాత్రం ఎక్కడా భయపడకుండా ప్రకటించారు. ఇక తెలంగాణాలో పాతబస్తీ లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. అక్కడ జాగ్రత్తగా చర్యలు తీసుకుంటుంది తెలంగాణా సర్కార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version