భారతీయ సంకేత భాషా పరిశోధన మరియు శిక్షణా కేంద్రం (ఐఎస్‌ఎల్‌ఆర్‌టిసి) మరియు ఎన్‌సిఇఆర్‌టిల మధ్య చారిత్రాత్మక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (ఎంఓయు) ఒప్పందం జరగనుంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.
ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, హిందీ మరియు ఇంగ్లీష్ మీడియం రెండింటిలోని అన్ని సబ్జెక్టుల యొక్క ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాలు, ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్ మరియు ఇతర అనుబంధ సామగ్రి మరియు వనరులు ఒకటి నుంచి 12 వ తరగతి వరకు విద్యా ముద్రణ వస్తువులు డిజిటల్ ఆకృతిలో భారతీయ సంకేత భాషగా ఉండే విధంగా రూపొందించినవి తీసుకుంటారు. చెవిటి పిల్లల కోసం ఈ ఒప్పందం జరుగుతుంది. భారతీయ భాషలో వారికి విద్యా బోధనకు ఇవి ఉపయోగపడతాయి.