Breaking : పోలీసుల జాబ్స్‌ అభ్యర్థులకు శుభవార్త..

-

తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లలో పోలీస్‌ శాఖలోని ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో అభ్యర్థులు లక్షల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు పోలీస్‌ నియామక మండలి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి పీఎంటీ, పీఈటీలాంటి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరైతే సరిపోయేలా కార్యాచరణ రూపొందించింది. గతంలో జరిగిన నియామకాల్లో ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేస్తే అన్ని మార్లు ఈ పరీక్షలకు హాజరు కావాల్సివచ్చేది. 2018లో తొలిసారిగా మండలి ఒక అభ్యర్థి ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసినా ఒకేసారి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యేలా చూసింది.

అయితే తాజాగా చేపట్టిన నియామకాల్లో ఈ విధానంలో మార్పు వస్తుందని ప్రచారం జరిగింది. కానీ క్రితం సారి విధానాన్నే కొనసాగించనున్నట్లు మండలి ప్రకటించింది. అభ్యర్థులు ఒకసారి పాల్గొన్న పరుగుపందెం, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ లాంటి పోటీలే కాకుండా వారి శారీరక కొలతల ఫలితాల్ని మూడు నెలలపాటు పరిగణనలోకి తీసుకోనున్నట్లు మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు.ఒకటికంటే ఎక్కువ పోస్టులకు 40శాతం మంది: మండలి తాజా నోటిఫికేషన్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. క్రితం సారి దాదాపు 6 లక్షల వరకు రాగా ఈసారి ఇప్పటికే పది లక్షలకుపైగా వచ్చాయి. గడువు మరో అయిదు రోజులు మిగిలి ఉండటానికి తోడు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేయడంతో దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. వయోపరిమితి పెంపుతో లక్ష వరకు దరఖాస్తు చేస్తారని మండలి అంచనా వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version