జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

-

జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. ఉద్యోగుల అసోసియేషన్‌ ప్రతినిధుల అంగీకారం మేరకు ఒకరోజు బేసిక్‌ వేతనాన్ని కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున అందజేయనున్నట్టు చెప్పారు. ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని నింపి వారు విధులకు హాజరయ్యేలా ప్రోత్సహించాలన్నారు. త్వరలోనే రాష్ట్ర రవాణాశాఖ మంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు తెలిపారు.

మరోవైపు బస్‌స్టేషన్లలో దుకాణదారులకు శుభవార్త చెప్పారు. మార్చి 22నుంచి జూన్‌ 7 వరకు బస్సులు నడపనందున చెల్లించవలసిన అద్దె బకాయిలు మాఫీ చేయాలని ఆదేశించారు. వారికి వాపసు చేయాల్సిన సెక్యూరిటీ డిపాజిట్‌ను వెంటనే చెల్లించాలన్నారు. . అక్టోబరులో రోజువారీ 30లక్షల కిలోమీటర్ల మేరకు కనీసం 60శాతం ఆక్యుపెన్సీతో బస్సులు నడపాలన్నారు. ప్రతీనెలా కనీసం రూ.250కోట్లు ఆదాయం ఆర్జించాలన్నారు. విధుల్లో ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబరులో వచ్చిన ఆదాయం డీజిల్‌ ఖర్చులకు సరిపోయిందని.. అక్టోబరు నుంచి బ్యాంకు లోన్లకు సంబంధించి బకాయిలు ప్రతీనెలా రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version