‘ఐడెంటిటీ’లో కీలకపాత్రలో త్రిష.. పోస్టర్ రిలీజ్

-

 

త్రిష కృష్ణన్.. మూడు పదుల వయసు దాటుతున్నా ఈ భామ అందం మాత్రం చెక్కు చెదరడం లేదు. ఎవర్ గ్రీన్ బ్యూటీలా రోజురోజుకు అందంగా తయారవుతోంది. యంగ్ హీరోయిన్లకు స్ట్రాంగ్ పోటీనిస్తోంది. ఈ బ్యూటీ క్యూట్ స్మైల్.. మెస్మరైజింగ్ ఛామ్ కుర్రాళ్లను కట్టిపడేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా హీరోయిన్ త్రిష కు క్రేజీ ఆఫర్ వచ్చింది.

2018 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటుడు టోవినో థామస్ ప్రతినాయక పాత్రలో నటించనున్న ‘ఐడెంటిటీ’ మూవీలో అగ్రనటి త్రిష ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని టోవినో సోషల్ మీడియాలో తెలిపారు. ఆమెతో కలిసి నటించేందుకు ఎదురు చూస్తున్నానని… త్వరలోనే మర్చిపోలేని సినిమా ప్రయాణం మొదలవుతుందని చెప్పారు. యాక్షన్, త్రిల్లర్ గా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version