మొక్కజొన్న తో బరువు తగ్గవచ్చా..? ఎలాంటి లాభాలు పొందవచ్చు అంటే..?

-

చాలామంది మొక్కజొన్నని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. రెగ్యులర్ గా తింటూ ఉంటారు మీరు కూడా మొక్కజొన్నని రెగ్యులర్ గా తింటున్నారా అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. మొక్కజొన్నలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి ఇందులో ఉంటాయి. చాట్, సూప్స్ ని వేసుకోవచ్చు. అయితే మొక్కజొన్నని తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి మొక్కజొన్న గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కజొన్నలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు కచ్చితంగా మొక్కజొన్న తీసుకోవచ్చు. ఒక కప్పు మొక్కజొన్న లో సుమారు 177 క్యాలరీలు ఉంటాయి మొక్కజొన్నని తీసుకోవడం వలన బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళు కచ్చితంగా తీసుకోవచ్చు. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్స్, మినరల్స్ ఇందులో ఎక్కువ ఉంటాయి క్యాలరీలు బాగా తక్కువ ఉంటాయి.

కంటి ఆరోగ్యానికి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది మెటాబలిజం ని కూడా ఇది బూస్ట్ చేస్తుంది బరువుని తగ్గిస్తుంది. పోషక పదార్థాలతో పాటుగా ఫైబర్ కూడా ఇందులో ఉంటుంది ఫైబర్ తీసుకోవడం వలన ఎక్కువ సేపు ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉంటుంది. సో మొక్కజొన్నను తీసుకోవడం వలన ఎక్కువ సేపు ఆకలి వేయదు కనుక ఎక్కువ ఆహారాన్ని మీరు డైట్ లో తీసుకోరు. కాబట్టి బరువు తగ్గుతారు. స్వీట్ కార్న్ చాట్, సూప్ వంటివి మీరు సులభంగా తయారు చేసుకుని తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version