టాలివుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం…!

-

మూడేళ్ళ క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాలివుడ్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులంతా బాధితులుగా పేర్కొంటూ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు అధికారులు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే సిట్ చార్జ్ షీట్ దాఖలు చేసినా ఇంతవరకు కోర్టుకు మాత్రం డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫోరెన్సిక నివేదిక కోర్ట్ కి చేరలేదు. మూడేళ్ళ క్రితం పలువురు టాలివుడ్,

హీరోలు, హీరోయిన్లు, నటులు, దర్శకులపై డ్రగ్స్ కేసు నమోదు చేసారు అధికారులు. ఆ తర్వాత వారిని అందరిని పిలిచి విచారణ చేపట్టారు సిట్ అధికారులు. అప్పట్లో ఒక దర్శకుడి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆర్టీఐ ద్వారా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచారం కోరినా సరే ఎక్సైజ్ శాఖ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం విశేషం.

ఇక ఈ కేసుని నీరు గారుస్తున్నారు అనే ఆరోపణలు కూడా వచ్చాయి. గతంలో డ్రగ్స్ కేసుకి సంబంధించి ఇలాంటి వార్తలు రాగా స్పందించిన అధికారులు, తాము ఎవరికి క్లీన్ చిట్ ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. మూడేళ్ళ క్రితం ఈ వ్యవహారం అప్పట్లో విద్యా సంస్థలను కూడా ఇబ్బంది పెట్టింది. విదేశీయులతో కలిసి కొందరు ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారం నడిపారని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version