చరిత్ర సృష్టించిన కేజీఎఫ్ 2… బాలీవుడ్ రికార్డ్ బద్ధలు

-

కేజీఎఫ్-2 ధాటికి బాలీవుడ్ రికార్డులు బద్ధలు అవుతున్నాయి. ఇన్నాళ్లు బాలీవుడ్ సినిమాల పేరుతో ఉన్న తొలి రోజు కలెక్షన్లను కేజీఎఫ్-2 తిరగరాసింది. కేజీఎఫ్-2 రికార్డ్ క్రియేట్ చేసిందని మూవీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. గతంలో ‘ వార్’, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ పేరుతో ఉన్న రికార్డులు కేజీఎఫ్ -2 దాటికి తుడిచిపెట్టుకుపోయాయి. తొలి రోజు కలెక్షన్లను పరిశీలిస్తే వార్ మూవీ రూ. 51.60 కోట్లు, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ రూ. 50.75 కోట్ల వసూళ్లను సాధించాయి. తాజాగా కేజీఎఫ్ -2 తొలి రోజు రూ. 53.95 కోట్ల కలెక్షన్లను సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. ఓ డబ్బింగ్ మూవీ ధాటికి బాలీవుడ్ పేరుతో ఉన్న రికార్డులు బ్రేక్ అవ్వడం విశేషం. 

కేజీఎఫ్ -2 మొత్తంగా తొలిరోజు రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 33 కోట్లు కలెక్షన్లు రాగా… హిందీ బెల్ట్ లోొ రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కలిపి రూ. 50కోట్లు, ఓవర్సీస్ రూ. 10 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version