`ఆర్ఆర్ఆర్` వాయిదాతో బ‌రిలోకి దిగిన `కేజీఎఫ్ 2`..!

-

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రాన్ని 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది జులైలో ‘ఆర్ఆర్ఆర్’ మూవీని విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తాజా ప్రకటన సూచిస్తోంది. ఇక ఈ జూలై రేసు నుంచి ఆర్ఆర్ఆర్‌ తప్పుకోవడంతో.. ఇప్పుడు మిగిలిన హీరోలు ఆ డేట్‌పై కన్నేశారు. ఈ క్రమంలో కేజీఎఫ్ 2 బ‌రిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.

య‌ష్ హీరోగా న‌టించిన చిత్రం `కేజీఎఫ్ చాప్ట‌ర్ 1`. సైలెంట్‌గా వ‌చ్చి సంచ‌ల‌నం సృష్టించిన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ వ‌సూళ్ల‌ని సాధించించింది. తొలి భాగం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో అందరి చూపు రెండ‌వ భాగం చాప్ట‌ర్ 2పై ప‌డింది. ఇక రెండో భాగాన్ని ఈ ఏడాది అక్టోబర్ గానీ డిసెంబర్‌లో గానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ముందుగానే రావాలని కేజీఎఫ్ 2 టీమ్ భావిస్తుందట. ఈ క్రమంలో జూలై 30ని విడుదల తేదీగా ఫిక్స్ చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version