మేడారంకు 20 స్పెషల్ రైళ్లు.. రాకపోకల సమయాలు ఇవే !

-

మేడారం జాతరకు విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైల్‌లను నడుపుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం… భారతీయ రైల్వే 20 ప్రత్యేక రైళ్లను వేసింది. అవి …

సింది అవి…విపరీతమైన రద్దీ ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైల్‌లను నడుపుతుంది. ఆ వివరాలు తెలుసుకుందాంసికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ రూట్‌లో 10 రైళ్లు, సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో 10 రైళ్లను ప్రకటించింది. ఈ 20 రైళ్లు మేడారం వెళ్లే భక్తులకు సేవలు అందించనున్నాయి.

సికింద్రాబాద్‌ మార్గంలో….

సికింద్రాబాద్-వరంగల్-హైదరాబాద్ స్పెషల్ ట్రైన్ 10 సర్వీసుల్ని ప్రకటించింది రైల్వే. 07014 నెంబర్ గల రైలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ప్రతీ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.40 గంటలకు రైలు వరంగల్ చేరుకుంటుంది, తిరుగు ప్రయాణంలో 07015 నెంబర్ గల రైలు వరంగల్‌లో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 9.40 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దారిలో మౌలాలి, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ్, రఘునాథపల్లి, ఘనపూర్, పిండియాల్, కాజీపేట స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.

సిర్పూర్‌ మార్గంలో

సిర్పూర్ కాగజ్‌నగర్-వరంగల్ రూట్‌లో ప్రత్యేక రైలు 10 సర్వీసులు ఉంటాయి. 07017 నెంబర్ గల రైలు 2020 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ప్రతీరోజు ఉదయం 05:30 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో బయల్దేరుతుంది. ఉదయం 9.30 గంటలకు రైలు వరంగల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07018 నెంబర్‌గల రైలు వరంగల్‌లో ఉదయం 11 గంటలకు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ చేరుకుంటుంది. దారిలో రాలపేట్, ఆసిఫాబాద్ రోడ్, రేపల్లెవాడ, రెచ్నీ రోడ్, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, మంచిర్యాల్, పెద్దంపేట్, రామగుండం, రాఘవాపురం, పెద్దపల్లి, కొత్తపల్లి, కొలనూర్, ఒదెల, పోత్కపల్లి, బిసుగీర్ షరీఫ్, జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్, కాజిపేటలో రైలు ఆగుతుంది.

ఆయా ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులువుగా మేడారం జాతరకు వెళ్లడానికి ఈ రైళ్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. రోడ్డుమార్గం కంటే రైలు మార్గంలో జాతరకు వెళ్లడం తక్కువ శ్రమతో ఆనందంగా వెళ్లవచ్చని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

  • కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version