బాహుబలి తర్వాత దక్షిణాది నుండి వస్తున్న సినిమాకి ఆ రేంజ్ లో అంచనాలు వచ్చాయంటే అది కేజీఎఫ్ 2 కి మాత్రమే అని చెప్పవచ్చు. కేజీఎఫ్ సూపర్ హిట్ కావడంతో కేజీఎఫ్ కోసం అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఆ అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని చిత్ర నిర్మాతలు మరీ ఎక్కువ కోట్ చేస్తున్నారని టాక్. తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు 70కోట్లు చెబుతున్నారట. అంతేకాదు ఓవర్సీస్ రేటు 80కోట్లు చెబుతున్నారని వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు అందరూ షాక్ కి గురవుతున్నారు. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమాకి అంతగా ఇవ్వని రేట్ చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియకుండా పోతుందని చెపుకుంటున్నారు. కేజీఎఫ్ హిట్టే. కేజీఎఫ్ 2 కోసం ఎదురుచూస్తున్న మాట నిజమే. ఆ మాత్రానికి మరీ ఆకాశం మీద ఎక్కి కూర్చుని దిగనే దిగను అంటే బావుండదు కదా అని సదరు డిస్ట్రుబ్యూటర్లు చెవులు కొరుక్కుంటున్నారు. మరి ముందు ముందు ఏమవుతుందో చూడాలి.