కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి

-

దివంగత పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయ రెడ్డి గురువారం తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఆమె జిహెచ్ఎంసి కార్పొరేటర్ గానూ కొనసాగుతున్నారు. అయితే టిఆర్ఎస్ లో ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతో చాలాకాలంగా మధన పడుతున్నట్లు సమాచారం. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇటీవల టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయిన విజయ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నట్లుగా తెలిపారు. ఆమె ప్రతిపాదనకు అక్కడికక్కడే ఓకే చెప్పిన రేవంత్ ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. తాజాగా గురువారం విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్ది వెంకట్ రెడ్డి, మాజీఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి తదితరుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version