ఖో ఖోలో భారతదేశం మొదటి ప్రపంచ ఛాంపియన్ జట్టుగా అవతరించింది. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో భారత మహిళల జట్టు ఏకపక్షంగా 38 పాయింట్ల భారీ తేడాతో నేపాల్‌ను సులభంగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీలో తొలి మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్‌లోనూ ఆధిక్యతతో గెలుపొందిన భారత మహిళల జట్టు.. ఫైనల్లోనూ అదే స్టైల్‌ను కొనసాగించి 78-40 స్కోరుతో నేపాల్‌ను ఓడించి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
ఖో ఖో ప్రపంచ కప్ జనవరి 13 నుంచి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్‌లో, భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 176 పాయింట్లు సాధించి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతోనే టీమ్ ఇండియా తన అడుగులను స్పష్టం చేసింది. ప్రతి జట్టుపై ఆధిపత్యం చెలాయిస్తూ.. ముందుకు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన ఫైనల్‌తో భారత జట్టు తన ఆశయాలను నిజం చేస్తూ టైటిల్‌ను కైవసం చేసుకుంది.