కరోనా సమయంలో ఎందరో అనాధలుగా మారుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, వృధాలకు,సీనియర్ సిటీజన్లకు,ముఖ్యంగా కోవిడ్ కాలంలో అనాధాలుగా ఉన్న పిల్లలకు రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్టాలకు,కేంద్రపాలితప్రాంతాలకు సూచనలు చేసింది కేంద్ర హోంశాఖ. నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.
సమాజంలో బలహీన వర్గాల పై దాడి నివారించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. మానవ అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. న్యాయవాదులు,సామాజికవేత్తలు ,ఎన్జీవోల నిపుణులు సభ్యులుగా ఉండేలా చూడాలని సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లో మహిళ హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని రాష్టాలకు,కేంద్ర పాలితప్రాంతలకు 107 కోట్లు మంజూరు చేసింది.