LATEST NEWS: విరాట్ కోహ్లీ బర్త్ డే, కామన్ డీపీ రిలీజ్ !

-

ప్రస్తుతం ఇండియా క్రికెట్ ప్లేయర్ మరియు మాజీ టీం కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ రేపు తన పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోహ్లీ కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. రేపు సోషల్ మీడియా అన్నింటిలోనూ కోహ్లీ గురించిన పోస్ట్ లు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు కోహ్లీ డై హార్ట్ ఫ్యాన్స్ అందరూ కూడా తమ సోషల్ మీడియా మెసెంజర్ లకు కామన్ డిస్ప్లే పిక్ గా ఏమి పెట్టుకోవాలి అన్నది కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. విరాట్ కోహ్లీ పుట్టినరోజును పురస్కరించుకుని కామన్ డీపీ ని రిలీజ్ చేయడంతో అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇప్పటి నుండే అందరూ విరాట్ కోహ్లీ పుట్టిన రోజుకు సంబంధించిన కామన్ డీపీ ని వాడుకుని విరాట్ కోహ్లీ పై తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇక వరల్డ్ కప్ లోనూ విరాట్ కోహ్లీ స్టడీగా పరుగులు చేస్తూ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా పోరాడుతున్నాడు. ఇక ఇండియా ఇప్పటికే సెమీఫైనల్ కు చేరుకోగా, సెమీఫైనల్ లో ఎవరితో తలపడనున్నది అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version