Kinnerasani Trailer: “కిన్నెరసాని” ట్రైలర్‌ తో వచ్చేసిన చిరు అల్లుడు

-

విజేత సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తాజాగా కిన్నెరసాని అనే డిఫరెంట్ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కళ్యాణ్ దేవ్. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీంద్ర విజయ్ కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్ర బృందం.

“నీ ముందు ఉన్న సముద్రం అలలు చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు నేను అంతే”అంటూ కథానాయిక శీతల్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్ ల నటన ఆకట్టుకునేలా సాగింది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం జనవరి 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రజనీ తాళ్లూరి మరియు రవి చింతల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version