కేసీఆర్ దే తొండాట..తెలంగాణలోని ప్రతి గింజా కొంటాం : కిషన్ రెడ్డి

-

కేసీఆర్ దే తొండాట..తెలంగాణలోని ప్రతి గింజా కొంటామని కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. హుజురాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తొండాట ఆడుతున్నారని.. గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఇచ్చిన కేంద్రం అభ్యంతరం చెప్పదని చురకలు అంటించారు.
ఎస్సి,  ఎస్టీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని.. సైన్స్ సిటీ, చేనేత క్లస్టర్ , మెడికల్ కాలేజ్ లకి సంబంధించి కావాలనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించడం లేదని చెప్పారు.

ప్రతిదీ రాజకీయం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు…కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినా ఏమీ చేయలేదని కేసీఆర్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. పక్క రాష్ట్రం అంధ్రప్రదేశ్ కు వరి ధాన్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది రావడం లేదు.. కానీ కేసీఆర్ కే ఎందుకు ఇబ్బంది వస్తోందని మండిపడ్డారు. గతంలో నిర్దేశించిన టార్గెట్ దాన్యం కూడా కేసీఆర్ ఇవ్వలేకపోయారని.. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. డబ్బులతో , మీడియా ను అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలుస్తామని అనుకోవడం భ్రమ అని.. చంద్రబాబు కి ఇవన్నీ ఉన్న ఓడిపోయారు కదా…? అని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version