జిహెచ్ఎంసి ఎన్నికలు.. కేసిఆర్, కేటీఆర్ పోటీపడుతున్నారు..!

-

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ముఖ్యంగా బిజెపి టీఆర్ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ఇటీవలే మరోసారి కేంద్ర మంత్రి బీజేపీ కీలక నేత కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కెసిఆర్ మాయ మాటలు నమ్మే పరిస్థితిలో ప్రస్తుతం ప్రజలు లేరని ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు అంటూ వ్యాఖ్యానించారు. యువత స్వచ్ఛందంగా వచ్చి బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దుబ్బాక లో తమ విజయానికి యువతే కారణం అంటూ వ్యాఖ్యానించారు.

ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే దుబ్బాక ఉప ఎన్నికల నాటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అబద్ధాలు చెబుతూ కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంలో పోటీ పడుతున్నారు అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. జిహెచ్ఎంసి విజయంలో యువత కీలక పాత్ర వహిస్తున్నారని యువత మొత్తం తమ వెంటే ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version