కిషన్ రెడ్డి ఎఫెక్ట్: బీజేపీకి బెనిఫిట్ అవుతుందా?

-

సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం ఉండదనే చెప్పొచ్చు. కానీ అలా బలం లేకపోయినా సరే కొందరు నాయకులు ఏళ్ల తరబడి ఆ పార్టీ కోసం కష్టపడుతున్నారు. సొంతంగా మంచి ఇమేజ్ తెచ్చుకుని, అంచెలంచెలుగా ఎదుగుతున్న నాయకులు ఉన్నారు. అలా బీజేపీలో కష్టపడి పైకి వచ్చిన నాయకుల్లో కిషన్ రెడ్డి ఒకరు. తెలంగాణ బీజేపీలో కీలక నాయకుడుగా ఉన్న కిషన్ రెడ్డికి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి దక్కింది.

కిషన్ రెడ్డి/ kishan reddy

మొదట జనతా పార్టీలో యువజన నాయకుడుగా పనిచేసిన కిషన్ రెడ్డి 1980లో బీజేపీ ఆవిర్భావించక, ఆ పార్టీలోకి వచ్చి యువ నాయకుడుగా పనిచేశారు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడుగా, ఎమ్మెల్యేగా సేవలు అందించారు. ఇక 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా సరే పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక వివాదరహితుడుగా, మంత్రిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంతో ప్రధాని మోదీ…కిషన్‌కు కేంద్ర మంత్రి హోదా ఇచ్చారు.

అయితే కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ హోదా దక్కడం వల్ల తెలంగాణలో బీజేపీకి ఏదైనా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు సపోర్ట్‌గా ఉంటే, ప్రజలు సైతం బీజేపీ వైపు చూసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ దూకుడుగా పనిచేస్తుంది. ఎంపీగా, బీజేపీ అధ్యక్షుడుగా బండి సంజయ్, కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇతర పార్టీ నాయకులని చేర్చుకుంటూ మంచి జోష్‌లో ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ హోదా రావడం అనేది బీజేపీకి బెనిఫిట్ అవుతుందనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version