మునుగోడులోనే సీఎం కేసీఆర్ కూర్చీ వేసుకుని కూర్చున్న భయపడేది లేదు – కిషన్ రెడ్డి

-

సీఎం కేసీఆర్ రేపు సభ పెట్టుకున్నా..ఇవాళ పెట్టుకున్నా.. లేక మునుగోడులోనే కూర్చీవేసుకుని కూర్చున్న భయపడేది లేదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. TRS సభ పెట్టుకోవడం లో అర్థం లేదని… వాళ్ల మీద, వాళ్ళ నేతల పైన విశ్వాసం లేకనే సభ అని మండిపడ్డారు. ఎన్నికల ముందు బిజెపి నీ బద్నాం చేయడం trs పార్టీ కి అలవాటు అని.. 8 యేళ్ళుగా గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను మభ్య పెట్టారని నిప్పులు చెరిగారు కిషన్‌ రెడ్డి.

బిజెపి మీ లాగా కుటుంబ పార్టీ కాదు… మీ లాగా అవినీతి పార్టీ కాదని.. కుర్చీ వేసుకుని కూర్చుంటానని చెప్పడం కెసిఆర్ కి అలవాటు అని చురకలు అంటించారు. కెసిఆర్ కుర్చీ చెప్పిన దగ్గర కాకుండా ఫార్మ్ హౌస్ లో వేసుకుంటారని.. రాజ్ గోపాల్ రెడ్డి రాజీనామా తో ఇక్కడ అనేక అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.

కెసిఆర్ కు మూడు అసెంబ్లీ లే కనిపిస్తాయి… గజ్వేల్, అయన కొడుకు సిరిసిల్ల అయన అల్లుడి హరీష్ రావు నియోజక వర్గాలేనని.. హైదరాబాద్ నడిబొడ్డున అభివృద్ధి ఉండదని ఆగ్రహించారు. తెలంగాణ అమరుల శవాల మీద కుర్చీలు వేసుకుని తెలంగాణ ను పాలిస్తున్నారు… తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తున్నారు… కల్వకుంట్ల కుటుంబం మాత్రమే హీరో ల మని వ్యవహరిస్తున్నారని.. ఎమ్మెల్యేలను జీరో లు చేశారని ఆగ్రహించారు. హుజూరాబాద్ మునుగోడు లో రిపీట్ కాబోతుందని స్పష్టం చేశారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version