నోట్లరద్దుపై కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

-

ఇటీవల ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు బీజేపీని టార్గెట్‌ చేశాయి. అయితే.. తాజాతా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి పలు అంశాలపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పునకు ఎలాంటి అవకాశం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రచారంలో ఉన్న వార్తలన్ని ఆధారం లేనివన్నారు. పార్టీలోని నేతలంతా ఒకే కుటుంబమని చెప్పుకొచ్చారు. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సర్వసాధారణమైన విషయమని తెలిపారు. అయితే.. మిగతా పార్టీల నేతలు కావాలనే ఈ వార్తలను రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనేది పార్టీ చేతుల్లో ఉండదని.. అది సీబీఐ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. అన్ని ఆధారాలున్నాయి కాబట్టే.. ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ కేంద్రం వదిలిపెట్టదని తెలిపారు. ఈ క్రమంలోనే అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను కూడా జైలుకు పంపించినట్టు చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version