ఈఎస్ఐ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు : కిషన్ రెడ్డి

-

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసి స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ,కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,భవగత్ కుబా,తెలంగాణ గవర్నర్ తమిళ్ సై, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనేందుకు కేంద్రం వద్ద డబ్బులు లేవంటూ కొంతమంది ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం(కాంగ్రెస్) రాష్ర్టంలో వరిధాన్యం కొనుగోలుపై 3 వేల750 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక వరి ధాన్యం కొనుగోలుపై 26 వేల కోట్లకుపైగా ఖర్చుపెట్టారని చెప్పారు కిషన్‌ రెడ్డి. ఈ విషయంలో వరి ధాన్యం కేంద్రం కొంటుందో లేదో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు కిషన్‌ రెడ్డి. ఇది రైతులకు అనుకూల ప్రభుత్వమా కదా..? అనే విషయాన్ని ఆలోచించాలి అని అన్నారు కిషన్‌ రెడ్డి. 2014 వరకూ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు 24 లక్షల టన్నుల వరకూ ఉండేవని, ఇవాళ మాత్రం ఎఫ్ సీఐ ద్వారా142 టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు ఉంటున్నాయని చెప్పారు.

ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ద్వారా కేంద్రం ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తోందన్నారు కిషన్‌ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో మూడు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తోందన్నారు. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రామగుండంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచామన్నారు. NTPC ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ ను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 800 మెగావాట్ల ప్రాజెక్టు పూర్తైందని, మిగతా నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయని చెప్పారు. దీని కోసం కేంద్రం రూ.4—000 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రామగుండలో ఈఎస్ఐ ఆస్పత్రి మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భూమి ఇవ్వడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరగా భూమి కేటాయిస్తే ఈఎస్ఐ ఆస్పత్రి అందుబాటులోకి వస్తుందని చెప్పారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version