ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా వాతావరణం ఉందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సూచించారు. ఇవాళ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్ణాటక బీజేపీ సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.

కచ్చితంగా మూడు స్థానాలు గెలిచి తీరాలని, మూడు సీట్లు గెలిచే సానుకూల పరిస్థితులు బీజేపీకి ఉన్నాయని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పూర్తి స్థాయి కమిటీలు, బూత్, అసెంబ్లీ, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని, మండలి ఎన్నికల ద్వారా దాన్ని బీజేపీ రుజువు చేయాలన్నారు.
ఓటర్ ని నేరుగా కలిసేలా ప్రచారం చేయాలని సూచించారు. బూత్ స్థాయిలో పని విభజన.. జిల్లా
లేదా అసెంబ్లీ వారీగా వర్క్ షాప్ త్వరలో నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version