బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం కిష్కిందపురి. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు పాజిటివ్ టాక్ లభించింది. భైరవం సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈనెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా నిన్న రాత్రి హైదరాబాద్ లోని AAA మల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు.
సినిమా చూసిన ఆడియన్స్ సినిమా బాగుందని చెబుతున్నారు. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్లేందుకు టైం తీసుకున్న దర్శకుడు ఎప్పుడైతే కిష్కింధపురి లోని సువర్ణ మాయలోకి అడుగుపెడతారో అక్కడ నుండి సినిమాను పరిగెత్తిస్తూ భయపెట్టేసాడు. ఎటువంటి అదనపు హంగులకు వెళ్లకుండా అనుకున్న పాయింట్ ను తెరపై అంతే చక్కగా ప్రజెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతే గ్రిప్టింగ్ గా హారర్ ఎలిమెంట్స్ ఎక్కడ తక్కువ చేయకుండా డైరెక్టర్ అదరగొట్టాడు. తమిళ నటుడు శాండ నటన గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
అనుపమ పరమేశ్వరన్ క్లైమాక్స్ లో చేసిన పర్ఫామెన్స్ బాగుందని చెప్పాలి. థ్రిల్లర్ ఎపిసోడ్స్ స్టోరీ నేరేషన్ బాగుందని సమాచారం. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఎం.ఆర్. రాధాకృష్ణన్ ఇచ్చిన సౌండింగ్ ఎంతో బాగుంది. హారర్ సినిమాను సౌండ్ తో ఎంత మ్యాజిక్ చేయవచ్చో అంత బాగా చేశాడు. మొత్తంగా చెప్పాలంటే కిష్కిందపురి సినిమా ప్రతి ఒక్కరిని భయపడుతూ ఆకర్షించే విధంగా ఉంది. పార్ట్-2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ చాలా అద్భుతంగా ఉంది.