ఉదయం లేవగానే వేడివేడి కాఫీ కప్పు లేకపోతే రోజు మొదలైనట్లే అనిపించదు. ఆ అద్భుతమైన సువాసన మొదటి గుక్కతో మన శరీరంలో ప్రవహించే ఉత్సాహం, ఇదంతా కాఫీ ప్రేమికులకు ఒక మ్యాజిక్. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కాఫీ కేవలం ఒక పానీయంగా కాదు అది ఒక అలవాటు ఒక జీవన విధానం. కాఫీ తాగడం వల్ల మన శరీరానికి శక్తి వస్తుందని మనకు తెలుసు, కానీ కాఫీ తాగే వారిలో కొన్ని ప్రత్యేకమైన ఆశ్చర్యకరమైన లక్షణాలు కూడా ఉంటాయని మీకు తెలుసా? ఈ లక్షణాల కేవలం కాఫీ ప్రభావం మాత్రమే కాదు అది వారిలో వ్యక్తిత్వం లో ఒక భాగం ఆసక్తికరంగా అనిపిస్తుంది కదూ అయితే ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం రండి..
చురుకుదనం కలిగి వుండటం : కాఫీలో ఉండే కెఫెన్ మన నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. అందుకే కాఫీ తాగగానే మనలో కొత్త ఉత్సాహం చురుకుదనం కనిపిస్తాయి. కాఫీ తాగే వారు ఉదయం పూట చాలా వేగంగా పని మొదలు పెడతారు వారి మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. ఏ పనిలో అయినా త్వరగా నిర్ణయాలు తీసుకోగలరు.
అసాధారణమైన జ్ఞాపకశక్తి : పలు పరిశోధనల ప్రకారం క్రమం తప్పకుండా కాఫీ తాగే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కెఫెన్ మెదడులో ఉండే కొన్ని రసాయనాలని ప్రేరేపించడం ద్వారా సమాచారాన్ని గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. అందుకే కాఫీ తాగే వారు కొత్త విషయాలను త్వరగా నేర్చుకోవడమే కాకుండా వాటిని ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు.

సమస్యలను సులభంగా పరిష్కరించడం: కాఫీ తాగేవారు సమస్యలను వేగంగా పరిష్కరించగలరు కెఫెన్ మెదడులో ఆలోచనలను వేగవంతం చేస్తుంది. దీని వల్ల వారు ఒక సమస్యను వివిధ కోణాల నుండి ఆలోచించి, వినూత్నమైన పరిష్కారాలను కనుగొనగలరు ఆఫీస్ లో ముఖ్యమైన ప్రాజెక్టులపై పనిచేసేటప్పుడు ఒక కప్పు కాఫీ తాగితే మెదడుకు పదును పెట్టినట్టే. తల నొప్పి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫి ఎంతో రిలీఫ్ ఇస్తుంది.
సానుకూల దృక్పథం : రోజు కాఫీ తాగడం అలవాటు ఉన్నవారు. ఎక్కువగా సానుకూల దృక్పథంతో ఉంటారని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఉదయం ఒక కప్పు కాఫీతో మొదలుపెట్టడం వల్ల కలిగే మానసిక ఉల్లాసం వారిని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. ఇది వారిని ఒత్తిడి నుంచి దూరంగా ఉంచి ఆనందంగా ఉండేందుకు సహాయపడుతుంది.
గమనిక: పైన పేర్కొన్న లక్షణాలు సాధారణంగా కాఫీ తాగే వారిలో కనిపించేవి మాత్రమే, అధికంగా కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య, గుండె దడ వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మితంగా తాగడం ఆరోగ్యానికి మంచిది.