ఆ హీరోకు చెప్పిన కథ ఇది కాదు… ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా దర్శకుడు..!

-

శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా ఈ సినిమాలో రాధిక, కుష్బూ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగివున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా దర్శకుడు కిషోర్ తిరుమల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు… ఈ ఇంటర్వ్యూలో కిషోర్ తిరుమలకు ఈ క‌థ‌ను ఇంత‌కుముందు వెంక‌టేష్‌ గారితో చేయాల‌నుకున్న‌దేనా అనే ప్రశ్న ఎదురైంది… కిషోర్ తిరుమల ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ… వెంకటేష్ కు చెప్పిన కథ ఇది కాదు.

వెరీ టైటిల్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించాలని అని అనుకున్నట్లుగా కిషోర్ తిరుమల తెలియజేశాడు. హీరో పాత్ర కాస్త దగ్గరగా ఉన్నప్పటికీ కథ మాత్రం భిన్నంగా ఉంటుంది అని, బ్యాక్ డ్రాప్ అదే కానీ కథను మార్చమని దర్శకుడు తిరుమల కిషోర్ తెలియజేశాడు. కిషోర్ తిరుమల ఇలా తాజా ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే వరస పరాజయాలతో డీలా పడిపోయిన శర్వానంద్ కు ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని తీసుకు వస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version