యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడానికి గల కారణాలు ఇవే..!

-

రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది చాలా మందిలో చూస్తున్నాము. అయితే యూరిక్ యాసిడ్ కనుక పెరిగిపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటే మనం కంట్రోల్ చేసుకోవడానికి అవుతుంది.

మన బాడీ ఎన్నో రకాల వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. రెగ్యులర్ గా పంపించే వాటిల్లో యూరిక్ యాసిడ్ కూడా ఒకటి. అయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడానికి గల కారణాలు ఇక్కడ ఉన్నాయి మరి వాటికోసం చూసేద్దాం.

కిడ్నీ సమస్యలు:

కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి యూరిక్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా యూరిక్ యాసిడ్ ని ఎలిమినేట్ చేయలేదు కాబట్టి యూరిక్ యాసిడ్ లెవెల్స్ సాధారణంగా పెరిగిపోతాయి. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కూడా చెక్ చేయించుకోవడం మంచిది.

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం:

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. అదే విధంగా షుగరి డ్రింక్స్, ప్రొసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ శాతం ఫ్రూక్టోజ్ ఉంటుంది.

మెడికేషన్:

కొన్ని రకాల డ్రగ్స్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి.

ఒబేసిటీ:

ఊబకాయం తో బాధపడే వాళ్లకు కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయి. కనుక ఊబకాయం తో బాధపడే వాళ్ళు బరువు తగ్గడానికి చూసుకోవాలి.

వయసు పైబడటం:

వయసు మార్పు వల్ల కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. తీసుకునే ఆహారం జీవన విధానం బట్టి కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version