వినాయక నిమజ్జనంలో డీజే ఆపరేటర్‌పై కత్తితో దాడి.. పోలీసులను పరిగెత్తిస్తూ!

-

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఘట్‌కేసర్ పొలీస్‌స్టేషన్ లిమిట్స్‌లో దారుణం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే ఆపరేటర్‌ను ఓ యువకుడు కత్తితో పొడిచి పరారయ్యాడు. పొలీసుల కథనం ప్రకారం..ఘట్కేసర్ పట్టణం ఈడబ్ల్యూఎస్ కాలనీలోని గురుకుల కళాశాల ఎదురుగా డైమండ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి వినాయక నిమజ్జన వేడుకలు ప్రారంభం అయ్యి శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. ఈ క్రమంలోనే ఘట్‌కేసర్‌కు చెందిన బైర్ల మహేందర్ అనే వ్యక్తి డీజే ఆపరేటర్ సాయిని కత్తితో పొడిచి పారిపోయాడు. సాయి భార్యపై కూడా విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.

అనంతరం అక్కడి నుంచి పరారైన మహేందర్ మరో వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని యువకులపై దాడికి యత్నించగా.. పోలీసులకు సమాచారం అందింది.వారు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో పోలీసులకు కూడా గాయాలైనట్లు సమాచారం. అయితే, డీజే ఆపరేటర్ సాయి ఏడాది కిందట మహేందర్ సోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పగతోనే సాయి మీద మహేందర్ హత్యాయత్నం చేసి ఉంటాడని స్థానికంగా ప్రచారం సాగుతోంది.కత్తిపొట్లకు గురైన సాయిని కీసరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version