విమాన ప్రయాణికులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!

721

సాధారణంగా.. బస్సులు, రైళ్లలో ప్రయాణంలా ఉండదు విమానం ప్రయాణం. దీనికి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మొదటిసారి విమానం ఎక్కేవాళ్లు అయిత ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే విమానం ఎక్కకుండానే వెనుదిరిగే అవకాశమూ లేకపోలేదు.

ఇదివరకు.. అంటే ఇప్పుడు కాదు లెండి. ఓ 10 – 15 ఏళ్ల కింద విమాన ప్రయాణం అంటే అది కేవలం ధనవంతులకే అందుబాటులో ఉండేది. ఎందుకంటే.. విమాన ప్రయాణం అంటేనే ఖర్చుతో కూడుకునేది. అందుకే ధనవంతులే విమానాన్ని ఎక్కేందుకు ఆసక్తి చూపేవారు. కానీ.. ఇప్పుడు రైలు ప్రయాణం కన్నా చీప్ అయిపోయింది విమానం ప్రయాణం.

know about airlines guidelines before boarding flight

అయితే.. సాధారణంగా.. బస్సులు, రైళ్లలో ప్రయాణంలా ఉండదు విమానం ప్రయాణం. దీనికి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే మొదటిసారి విమానం ఎక్కేవాళ్లు అయిత ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే విమానం ఎక్కకుండానే వెనుదిరిగే అవకాశమూ లేకపోలేదు.

ఎయిర్ లైన్స్ గైడ్ లైన్స్ ను ఖచ్చితంగా ప్రతి ప్రయాణికుడు పాటించాల్సిందే. లేకపోతే విమానంలో ప్రయాణం చేయడం కష్టం.

ఎయిర్ లైన్స్ ఆమోదించే పరిమితి మేరకే లగేజీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. హెవీ లగేజీ తీసుకెళ్తే మీకు లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని వల్ల అదనంగా లగేజీ ఫీ కట్టడమే కాకుండా లేనిపోని ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది.

అందుకే.. విమానం టికెట్ లో లగేజికి సంబంధించిన పరిమితులు ఉంటాయి. వాటిని ఫాలో అయితే బెటర్. లేదంటే విమానాశ్రయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.

మద్యం మత్తులో ఉన్నా… డ్రగ్స్ తీసుకున్నా… విమానంలో ప్రయాణించడానికి అనుమతించరు. ఇతర ప్రయాణికులకు అవి అసౌకర్యాన్ని కలిగిస్తాయి. అందుకే.. విమాన ప్రయాణం ముందు ఎటువంటి ఆల్కాహాల్ సేవించకపోవడం మంచిది. డ్రగ్స్ తీసుకున్నా విమాన సిబ్బంది పసిగట్టేస్తారు.

చెప్పులు లేకున్నా విమానంలోకి అనుమతించరు

ప్రయాణికుల దుస్తులు కూడా అభ్యంతరకరంగా ఉండకూడదు. ఇతర ప్రయాణికులు అభ్యంతరం చెప్పినా లేని పోని సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే.

గర్భిణీలు అయితే తొమ్మిదో నెలలో విమానం ఎక్కనీయరు. అయితే.. ఎయిర్ లైన్స్ ను బట్టి నిబంధనలు మారుతుంటాయి. గర్భిణీలు ఖచ్చితంగా డాక్టర్ సర్టిఫికెట్ చూపించాల్సిందే.

విమానం టేక్ ఆఫ్ అవుతున్నా… ల్యాండింగ్ అవుతున్నా.. ఆ సమయంలో వాయిస్ కాల్స్ చేస్తే మీ ప్రయాణానికి బ్రేక్ పడుతుంది. అలాగే విమానంలో సిగిరెట్ తాగకూడదు. తాగినట్టు తెలిస్తే తీసుకెళ్లి జైలులో వేస్తారు.

ఎయిర్ పోర్టులో అయినా.. విమానంలో అయినా.. ఏ సిబ్బంది మీదా దాడి చేయకూడదు. అలా చేసినా కూడా జైలులో వేస్తారు.