సాధారణంగా టూ వీలర్ లేదా కారు.. దేన్ని కొనుగోలు చేసినా సరే ఎక్కువ మైలేజీ(Mileage), ఎక్కువ పికప్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే మైలేజీ, పికప్ రెండూ ఒకే దాంట్లో కావాలంటే కష్టమే. కానీ ప్రస్తుతం వస్తున్న వాహనాల్లో లేటెస్ట్ టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నారు కనుక.. ఒకే వాహనంలో పికప్‌తోపాటు మైలేజీ కూడా వచ్చేలా ఫీచర్లను అందిస్తున్నారు. అయితే కార్లు కొన్ని సందర్భాల్లో తక్కువ మైలేజీని ఇస్తుంటాయి. దాని వెనుక ఉన్న కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. కారును ఎప్పుడూ నిర్దేశించిన సమయానికి సర్వీసింగ్ చేయించాలి. టైముకు సర్వీసింగ్ చేయించకపోతే ఇంజిన్ పనితీరు మందగిస్తుంది. దీంతో మైలేజీ తగ్గుతుంది. కనుక టైముకు సర్వీసింగ్ చేయించాలి. అలాగే ఏవైనా పార్ట్‌లను మార్చినా, ఆయిల్‌ను నింపినా బ్రాండెడ్ కంపెనీలకు చెందినవి వాడాలి. లేదంటే ఇంజిన్ సరిగ్గా పనిచేయక మైలేజీ తగ్గుతుంది.
2. మాటి మాటికీ క్లచ్‌ను వాడినా మైలేజీ తగ్గుతుంది. కనుక క్లచ్‌ను తక్కువగా వాడాలి. నగరాల్లో రహదారులపై ఎలాగూ రద్దీ ఉంటుంది కనుక మనం ఏమీ చేయలేం. కానీ రద్దీ తక్కువగా ఉన్న రహదారుల్లో వీలైనంత వరకు క్లచ్‌ను తక్కువగా వాడాలి. దీంతో ఇంధనం ఆదా అవడమే కాక మైలేజీ వస్తుంది.
3. కారులో కొందరు దాని కెపాసిటీని మించి బరువులు వేస్తుంటారు. వస్తువులతో నింపుతారు. లేదా ఎక్కువ మంది కూర్చుంటారు. ఇలా చేసినా మైలేజీ తగ్గుతుంది. కనుక కారులో ఓవర్ లోడ్‌తో ప్రయాణించరాదు.
4. కారు టైర్లలో ఎల్లప్పుడూ గాలి తగినంత ఉందో లేదో చెక్ చేయాలి. గాలి తగ్గినా మైలేజీపై ప్రభావం చూపిస్తుంది. కనుక తరచూ గాలిని నింపి ఉంచాలి.
5. ఎక్కువ గేరులో ప్రయాణించాల్సిన చోట కొందరు తక్కువ గేర్‌లో వాహనాన్ని నడుపుతారు. దీని వల్ల కూడా మైలేజీ రాదు. కనుక వేగంగా ప్రయాణించేటప్పుడు ఎక్కువ గేర్‌ను వాడాలి. నెమ్మదిగా ప్రయాణం చేసేటప్పుడు తక్కువ గేర్‌లో వెళ్లాలి. దీంతో మైలేజీ వస్తుంది.