ఆ యంగ్ హీరో కు ఫుల్ డిమాండ్‌.. ఒక్క సినిమాతోనే!

-

ఆ యంగ్ హీరో అంద‌రి హీరోల్లాగా త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకునేందుకు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈయ‌న ఇంత‌కుముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఏకంగా హీరోగా మారిపోయాడు. అయితే ఈ యంగ్ హీరోకు ల‌క్ బాగానే ఉన్న‌ట్టు ఉంది. ఆయ‌న చేసిన మొద‌టి సినిమా బాగానే ఆడ‌టంతో ఇప్పుడు వ‌రుస‌గా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. చాలా డిమాండ్ వ‌చ్చేసింద‌ని తెలుస్తోంది.

యంగ్ హీరో /Young Hero

ఆయ‌నెవ‌రో కాదు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న తేజ సజ్జా. ఈ హీరో వరస మూవీల‌తో జోరుమీదున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు పెద్ద సినిమాల‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న చేసిన జాంబిరెడ్డి సూపర్ హిట్ అయి ప్రొడ్యూస‌ర్ల‌కు భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో తేజ‌కు మంచి డిమాండ్ ఏర్పడినట్లు స‌మాచారం.

ఇక ఇదే సంద‌ర్భంలో తేజ ప్రస్తుతం చేస్తున్న హను-మాన్ మూవీకి ఏకంగా రూ. కోటి వ‌ర‌కు రెమ్యూనరేషన్ ప్రొడ్యూస‌ర్లు ఇస్తున్నారంట‌. ఎందుకంటే న‌టుల‌కు తాము ముందు చేసిన సినిమాల‌తోనే రెమ్యున‌రేష‌న్ పెరుగుతుంద‌ని తెలిసిందే. కాగా తేజ మార్కెట్‌ను జాంబిరెడ్డి పెంచేసింద‌ని చెప్పొచ్చు. ఇక దీంతో పాటే ఆయ‌న అద్భుతం అనే మూవీలో కూడా చేస్తున్నాడు. అంటే ఒక్క సినిమాతోనే మ‌నోడికి మంచి క్రేజ్ వ‌చ్చేసింద‌న్న‌మాట‌. ఇంకా చాలామంది ప్రొడ్యూస‌ర్లు మ‌నోడికి బాగానే ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version