రూ.10వేల‌కే కొడాక్ కొత్త ఆండ్రాయిడ్ టీవీ..!

-

కెమెరాల‌ను త‌యారు చేసే కంపెనీ కొడాక్‌.. భార‌త్‌లో ఎక్స్‌ప్రొ, సీఏ సిరీస్‌లో మొత్తం 7 టీవీల‌ను లాంచ్ చేసింది. వీటిల్లో ఆండ్రాయిడ్ ఓఎస్ 9.0ను అందిస్తున్నారు. అలాగే ఇన్‌బిల్ట్ గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది. క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ, బ్లూటూత్ 4.1 త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అన్ని టీవీల్లోనూ కామ‌న్‌గా అందిస్తున్నారు.

కొడాక్ నూత‌న టీవీల‌లో అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, గూగుల్ ప్లే స్టోర్ వంటి యాప్స్ ఇన్‌బిల్ట్‌గా ఉంటాయి. 24 వాట్ల కెపాసిటీ క‌లిగిన సౌండ్ అవుట్‌పుట్ ల‌భిస్తుంది. డాల్బీ విజ‌న్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల పిక్చ‌ర్ క్వాలిటీ బాగుంటుంది.

కొడాక్ టీవీల ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…

* 32 ఇంచుల హెచ్‌డీ 7ఎక్స్ ప్రొ టీవీ ధ‌ర రూ.10,999
* 40 ఇంచుల ఫుల్ హెచ్‌డీ 7ఎక్స్ ప్రొ టీవీ ధ‌ర రూ.16,499
* 43 ఇంచుల ఫుల్ హెచ్‌డీ 7ఎక్స్ ప్రొ టీవీ ధ‌ర రూ.18,999
* 43 ఇంచుల 4కె 7ఎక్స్ ప్రొ టీవీ ధ‌ర రూ.21,999
* 50 ఇంచుల 4కె 7ఎక్స్ ప్రొ టీవీ ధ‌ర రూ.25,999
* 55 ఇంచుల 4కె 7ఎక్స్ ప్రొ టీవీ ధ‌ర రూ.29,999
* 75 ఇంచుల 4కె సీఏ సిరీస్ టీవీ ధ‌ర రూ.99,999

కొడాక్ నూతన ఆండ్రాయిడ్ టీవీల‌ను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌లో ఆగ‌స్టు 6 నుంచి విక్ర‌యిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version