గుంటూరులో మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బూట్లను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. నాని ఎక్కడున్నా బయటకు రావాలి అంటూ టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఆ ఫ్లెక్సీలు వేయించారు. సార్వత్రిక ఎన్నికల ముందు కుప్పంలో చంద్ర బాబు గెలిస్తే రాజకీయ సన్యాసం చేసి ఆయన బూట్లు తుడుస్తానని నాని ప్రకటించినట్లు సమాచారం.
కాగా, గత ఐదేళ్లు ఏపీలో సాగించిన అరాచక పాలనతో వైసిపి మూల్యం చెల్లించుకుంది. ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ కనీవిని ఎరగని రీతిలో ఓటమి పాలయింది.వైఎస్ జగన్ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది