నారాయణ ఏమన్నా పోటుగాడా? : కొడాలి నాని

-

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకులు నారాయణను పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకుల కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నారాయణ అరెస్ట్‌ కక్ష్యసాధింపు చర్యగా టీడీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గుంటూరులో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన… నారాయణ అరెస్ట్‌పై స్పందిస్తూ.. నారాయణపై కక్ష్య సాధించడానికి నారాయణ ఏమన్నా పోటుగాడా? అంటూ మండిపడ్డారు. రాజకీయాలకు దూరంగా అజ్ఞాతంలో బ్రతుకున్నాడు.. ప్రభుత్వం మీద బురద జల్లడానికి చంద్రబాబుతో కలిసి కుట్ర పన్నాడని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు అవసరానికి ఎంత మంది నైనా బలిచేస్తాడని, జగన్‌ను అబాసు పాలు చేయడానికి పిల్లల భవిష్యత్ ను ఫణం గా పెడతాడా? దేవాలయాలను కూల్చడం, మహిళలను హత్యలు చేయించడం పిల్లల పరిక్ష లతో ఆటలు ఆడటం ఇవన్నీ టిడిపి కుట్రలు కాదా? ఈ కుట్రలన్ని జగన్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ కుట్రల వెనుక నారాయణ కాదు ఎంతమంది ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించించారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version