కొడాలితో కష్టమే.. గుడివాడలో ‘సైకిల్’ సీన్ మారదా?

-

చంద్రబాబుకు పెద్ద శత్రువు ఎవరైనా ఉంటే అది కొడాలి నాని అనే చెప్పాలి..అదేంటి జగన్ ఉన్నారు కదా అని అనుకోవచ్చు…అయితే ఇక్కడ ఒక లాజిక్ చెప్పుకోవాలి…రాజకీయంగా చంద్రబాబుకు శత్రువు జగనే…కానీ జగన్ ఏదో అప్పుడప్పుడు మాత్రమే బాబుపై విమర్శలు చేస్తారు…అదే కొడాలి నాని అయితే అలా కాదు…కేవలం బాబు కోసమే కొడాలి మీడియా ముందుకొస్తారు…ఇక కొడాలి ఏ విధంగా తిడతారో అందరికీ తెలిసిందే. కొడాలి మాటలు చూస్తే రాజకీయంగా కాదు…బాబుకు వ్యక్తిగతంగా శత్రువు అన్నట్లు అనిపిస్తుంది..ఈ విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు.

అందుకే టీడీపీ వాళ్ళందరికీ కొడాలి అంటే కోపం..అసలు కొడాలికి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తూ ఉంటారు..అయితే రాజకీయంగా కొడాలికి చెక్ పెట్టడం అంత సులభం కాదు..ఆయనకు చెక్ పెట్టడం అంటే…ఆయన్ని ఓడించడమే..కొడాలి ఓడిపోతే టీడీపీకి పెద్ద పండగే..కానీ కొడాలి ఓటమి అంత సులభం కాదని…2014, 2019 ఎన్నికలు రుజువు చేశాయి..2014లో టీడీపీ గాలి ఉన్నా సరే..టీడీపీ కంచుకోటగా ఉన్న గుడివాడలో కొడాలి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు…ఇక 2019 ఎన్నికల్లో కూడా కొడాలి విజయానికి బ్రేకులు వేయలేకపోయారు..అభ్యర్ధిని మార్చిన ఫలితం శూన్యం.

పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక కొడాలి ఏ విధంగా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలా విరుచుకుపడుతున్న కొడాలిని వదలకూడదని టీడీపీ చూస్తుంది..ఈ సారైనా గుడివాడలో కొడాలిని ఓడించాలని చూస్తుంది. అయితే ఈ సారి గుడివాడలో కొడాలిని ఓడించడం సులువేనా అంటే..కష్టమే అని చెప్పాలి..ఎందుకంటే గుడివాడలో కొడాలిని ఢీకొట్టే సత్తా టీడీపీకి రాలేదు..కాస్తో కూస్తో కొడాలి బలం తగ్గొచ్చు…అయితే టీడీపీ బలం పెరగలేదు. పైగా టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుకు…కొడాలిని ఢీకొట్టే సత్తా కనబడటం లేదు.

మరి అలాంటప్పుడు అభ్యర్ధిని మారిస్తే ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు…అలాగే జనసేనతో పొత్తు ఉంటే కాస్త అడ్వాంటేజ్…అయితే 2014లో జనసేనతో పొత్తు ఉంది…2019లో అభ్యర్ధిని మార్చారు..అయినా సరే ఉపయోగం లేదు…మరి ఈ సారైనా గుడివాడలో సైకిల్ తలరాత మారుతుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version