ఎన్టీఆర్‌ను క్షోభపెట్టిన వయసులోనే చంద్రబాబు జైలుకెళ్తున్నాడు : కొడాలి నాని

-

కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘నేడు అన్న ఎన్టీఆర్ ఆత్మ శాంతించిన రోజు. ఎన్టీఆర్ విగ్రహాల నుంచి ఆనందభాష్పాలు వస్తున్నాయి. దొంగ స్కిల్స్‌తో కోట్లాది రూపాయలను బాబు దోచుకున్నాడు. చంద్రబాబును జైలుకు ఈడ్చుకెళ్లిన రోజును లోకేశ్ రెడ్ బుక్లో రాసుకోవాలి. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ను క్షోభ పెట్టిన చంద్రబాబు.. అదే వయసులో జైలుకెళ్తున్నాడు’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనలోని దొంగ స్కిల్స్ అన్నిటినీ ఉపయోగించి స్కిల్ డెవలప్మెంట్ సొమ్మును దోచుకున్నాడని చెబుతూ చంద్రబాబును జైలు ఈడ్చుకెళ్తున్న విషయాన్ని లోకేష్ తన రెడ్ బుక్లో రాసుకోవాలన్నారు.

సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబుని పట్టుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎన్టీఆర్, వైయస్సార్ అభిమానిగా ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. 74 ఏళ్ల వయసులో ఎన్టీఆర్కు క్షోభ పెట్టిన చంద్రబాబు, అదే వయసులో జైలుకెళ్తున్నాడన్నారు. ఎంగిలి మెతుకులకు ఆశపడిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులు నాడు తండ్రిని క్షోభ పెట్టిన చంద్రబాబు కాళ్ల వద్దకు చేరారని దేవుడు ముందు ఎవరు తప్పించుకోలేరన్నది చంద్రబాబు విషయంలో నిరుపితమైందన్నారు. ఎన్నికలవేళ సింపతి వస్తుందని కూడా ఆలోచించకుండా అవినీతిపరుడు చంద్రబాబుపై సీఎం జగన్ దర్యాప్తు చేయించారని, ఎవరు అవినీతికి పాల్పడినా ఉక్కుపాదంతో అణిచివేస్తానని జగన్ నిరూపించారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version