పవన్ చాలా ఓవర్ యాక్షన్ చేశారు: సజ్జల

-

అవినీతి చేసిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడి హడావిడి ఎక్కువైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు తరఫున దత్తపుత్రుడు హంగామా చేశారని, నిన్న రాత్రి పవన్ చాలా ఓవర్ యాక్షన్ చేశారని మండిపడ్డారు. ఇక చంద్రబాబుకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందన్న సజ్జల.. తనను ఎవరు అరెస్ట్ చేస్తారన్న ధీమా ఇప్పుడేమైందని ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలతో తెలుగు రాష్ట్రాల్లో జైలుకు వెళ్లబోతున్న తొలి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్యానించారు సజ్జల రామకృష్ణా రెడ్డి.

అంతేకాకుండా.., అవినీతి కేసులలో చంద్రబాబు దొరకడం ఖాయం. తనపై దాఖలైన కేసుల్ని చంద్రబాబు చట్ట ప్రకారం ఎదుర్కోవాలి. చంద్రబాబు అరెస్ట్.. ప్రపంచంలో జరగరాని ఘోరం అన్నట్లు టీడీపీ శ్రేణులు వ్యవహరించాయి. చేసిన నేరాలకు తలదించుకోవాల్సిందిపోయి.. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. తప్పు చేయకుంటే రూ.కోటి ఇచ్చి లాయర్‌ను ఎందుకు తెచ్చుకున్నారు. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయం. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చిన్నది. ఇంకా చాలా కేసులు వున్నాయి’’ అని సజ్జల వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version